Srimukhi : యాంకర్ శ్రీముఖి బహిరంగ క్షమాపణలు
తెలుగులో టాప్ యాంకర్లలో శ్రీముఖి(Srimukhi) ఒకరు. అయితే ఇటీవల ఆమె ఓ వివాదంలో ఇరుక్కుంది.
దిశ, వెబ్ డెస్క్ : తెలుగులో టాప్ యాంకర్లలో శ్రీముఖి( Sreemukhi ) ఒకరు. అయితే ఇటీవల ఆమె ఓ వివాదంలో ఇరుక్కుంది. దానికి చెక్ పెట్టేందుకు బహిరంగ క్షమాపణ(Public apologies) కోరుతూ ఓ వీడియోను పోస్ట్ చేసింది ఈ అమ్మడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్రీముఖి ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో యాంకరింగ్ చేసింది. ఒక సందర్భంలో రాముడు లక్ష్మణుడు (Rama-Laxmana) ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని వ్యాఖ్యానించింది. శ్రీముఖి వ్యాఖ్యలపై పలు హిందూ సంఘాలు మండిపడ్డాయి. వెంటనే క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చాయి. దీంతో బెంబేలెత్తిపోయిన శ్రీముఖి.. బహిరంగ క్షమాపణలు కోరుతూ వీడియో పెట్టింది. తనకు రాముడు అంటే అపారమైన భక్తి అని, పొరపాటున ఆ ఈవెంట్ లో అలా అన్నానని, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని తెలుపుతూ.. ఈ వ్యవహారంలో అందరూ తనను క్షమించాలని కోరింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియోను పోస్ట్ చేసింది.