‘అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారు’.. మెగా డాటర్ కీలక వ్యాఖ్యలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప-2 ది రూల్’(Pushpa 2) మూవీ ప్రీమియర్ షో సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే.

Update: 2025-01-08 14:32 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప-2 ది రూల్’(Pushpa 2) మూవీ ప్రీమియర్ షో సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు హైదరాబాద్(Hyderabad) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొక్కిసలాట ఘటన పై సినీనటి, మెగా డాటర్ నిహారిక(Niharika) తొలిసారి స్పందించారు. నిహారిక నటించిన తాజా చిత్రం ‘మద్రాస్ కారన్’ ఈ నెల 10వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మూవీ ప్రమోషన్‌లో భాగంగా నిహారిక మాట్లాడుతూ .. ఇలాంటి ఘటనలు ఎవరి ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయని అన్నారు. మహిళ చనిపోయిన విషయం తెలిసి ఎంతో బాధపడ్డాను. అందరి మద్దతుతో అల్లు అర్జున్ ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నారని చెప్పారు. తన కేరీర్‌కు సంబంధించి కుటుంబ(Family) సభ్యుల సూచనలు, సలహాలు తీసుకుంటుంటానని నిహారిక పేర్కొన్నారు. కథల ఎంపికలో గందరగోళానికి గురైనప్పుడు అన్న వరుణ్ తేజ్‌ను సలహా తీసుకుంటానని, లుక్స్ విషయంలో అల్లు అర్జున్(Allu Arjun) ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు. ప్రతి సినిమాకు ఆయన స్టైల్ మారుస్తుంటారని నిహారిక తెలిపారు.

Read More ...

‘పుష్ప-2’ పై నా వ్యాఖ్యలను వక్రీకరించారు’.. మరోసారి స్పందించిన సీనియర్ నటుడు


Tags:    

Similar News