Pushpa 2: రష్మికను మ్యాచ్ చేస్తూ పీలింగ్స్ పాటకి స్టెప్పులేసిన 80 ఏళ్ల ముసలి బామ్మా ( వీడియో )
ఒక ముసలి బామ్మా .. ఆమెకి సరిగా పళ్లు కూడా ఉన్నాయో లేవో తెలియదు.. కానీ, స్టెప్పులు మాత్రం విరగదీసింది.
దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) నటించిన పుష్ప 2 ( Pushpa 2) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. బాహుబలిని రికార్డును కూడా బద్దలు చేసి దూసుకెళ్తుంది. ఇక, దేవిశ్రీ ఇచ్చిన పాటలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా, పీలింగ్స్ పాటకి స్పెషల్ క్రేజ్ రావడంతో ఆ సాంగ్ కు ఇప్పటికే ఎంతోమంది రీల్స్ చేశారు. అన్నీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో ఈ పాట సూపర్ హిట్ గా నిలిచింది.
శ్రీలీల ఐటెం సాంగ్ చేసినా కూడా రష్మిక పీలింగ్స్ ( Peelings Song ) పాట మాత్రం చార్ట్ బస్టర్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ మార్క్ మ్యూజిక్ తో పాటను అదరగొట్టాడు. ఐతే, ఈ పాటని చాలామంది రీల్స్ చేయగా లేటెస్ట్ గా ఒక ముసలి బామ్మా .. ఆమెకి సరిగా పళ్లు కూడా ఉన్నాయో లేవో తెలియదు.. కానీ, స్టెప్పులు మాత్రం విరగదీసింది. " పీలింగ్స్ " పాటలో హీరోయిన్ రష్మిక మందన్న ఎలా అయితే మాస్ స్టెప్పులు వేసిందో ఆమెను మ్యాచ్ చేస్తూ ఈ బామ్మ కూడా ట్రై చేసింది. ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. బామ్మ గారు ఈ వయసులోనే ఇలా చేస్తున్నారంటే .. యంగేజ్ లో ఏ రేంజ్ డ్యాన్స్ వేసి ఉంటుందో ఓ సారి ఊహించుకోండి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.