Vijay Deverakonda: ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ విజయ్ దేవరకొండ కీలక విజ్ఞప్తి.. పోస్ట్ వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ‘వీడీ-12’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ‘వీడీ-12’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనిని గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri ) తెరకెక్కిస్తుండగా.. ఈ సమ్మర్‌లో విడుదల కానుంది. దీంతో పాటు మరో రెండు సినిమాలు ఓకే చేశారు. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతున్నాడు. తాజాగా, ఈ రౌడీ హీరో అభిమానులకు, ప్రజలకు ఓ కీలక విజ్ఞప్తి చేశాడు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించాడు.ఫేక్ కాల్స్, మెసేజ్‌లపై అవగాహన కల్పించేలా ఓ స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేశాడు.
అంతేకాకుండా ఇందులో తన స్నేహితుడికి జరిగిన ఓ ఘటనను కూడా వివరించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘జాగ్రత్త! స్నేహితుడిని, శ్రేయోభిలాషిని అంటూ మాట కలుపుతూ డబ్బులు అడిగే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు ఖాతాలో మనీ క్రెడిట్ అయినట్లు సైతం మెసేజ్‌లు సృష్టిస్తారు. ఒకవేళ అలాంటివి ఏమైనా వస్తే ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకునేందుకు తప్పనిసరిగా బ్యాంక్ స్టేట్‌మెంట్(Bank statement) చూసుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే నేను మూర్ఖుడిని కాదు అని చెప్పండి’’ అనే క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం విజయ్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఈ పోస్ట్ చూసిన వారంతా ప్రజలను అప్రమత్తం చేసినందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read More ...
Game Changer: గేమ్ ఛేంజర్ నుంచి 'కొండ దేవర' సాంగ్ వచ్చేసింది