Game Changer : రిలీజ్‌కి ముందు గేమ్ ఛేంజర్‌కు ఊహించని షాక్
మెగా హీరో రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్(Game Changer)సినిమా విడుదలకు ముందు ఊహించని షాక్ తగిలింది.
దివ, వెబ్ డెస్క్ : మెగా హీరో రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్(Game Changer)సినిమా విడుదలకు ముందు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government ) గేమ్ ఛేంజర్ సినిమా బెనిఫిట్ షోలకు (మార్నింగ్ 4 AM షో) అనుమతించడానికి వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు(High Court)లో లంచ్ మోషన్ పిటిషన్(Lunch motion petition) దాఖలైంది. బెనిఫిట్ షోలను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గేమ్ ఛేంజర్ సినిమాకు బెనిఫిట్ షోలకు, టికెట్ల ధరలపెంపుకు అనుమతించడంతో టికెట్ల ధరలను తొలి రోజు ఉ.4 గంటల షోతో సహా ఆరు ఆటలకు అనుమతించి... సింగిల్ స్క్రీన్ రూ. 100, మల్టీప్లెక్స్ లో రూ. 150 పెంపుకు అనుమతించింది. ఈ నెల 11 నుంచి 19 వరకు ఐదు షోలకు అనుమతించి.. సింగిల్ స్క్రీన్ రూ.50, మల్టీప్లెక్స్ లో రూ.100 పెంపునకు అనుమతించింది. ఈ నిర్ణయాన్నిసవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అటు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే గేమ్ ఛేంజర్, ఢాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలకు 10రోజుల పాటు అనుమతించింది.
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్మాతల వినతుల మేరకు తొమ్మిది రోజుల పాటు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపుకు అనుమతినిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన ప్రకటనకు భిన్నంగా బెనిఫిట్ షోలకు, టికెట్ల ధరల పెంపుకు అనుమతినివ్వడాన్ని ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
కాగా గేమ్ ఛేంజర్ సినిమా బెనిఫిట్ షోలు..టికెట్ల ధరలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ ను అనుమతించిన హైకోర్టు తెల్లవారుజామున అదనపు షోలకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అదనపు షోలు, షో టైమింగ్స్, ప్రేక్షకుల రద్దీ నియంత్రణకు సంబంధించి శుక్రవారం ఆదేశాలు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. అలాగే టికెట్ ధరల పెంపు అంశాన్ని "పుష్ప-2" కేసుతో పాటుగా విచారణ జరుపుతామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.