సీఎం రేవంత్ రెడ్డి ప్రవాస భారతీయుల దినోత్సవ ​సందేశం

ప్రవాస భారతీయుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉంటున్న భారతీయులు అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2025-01-09 17:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రవాస భారతీయుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉంటున్న భారతీయులు అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధిలో ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీ పాత్ర ముఖ్యమైనదని, తెలంగాణ రైజింగ్ కార్యాచరణలోనూ ఎన్నారైల భాగస్వామ్యం ఆవశ్యకమని ఈ మేరకు గురువారం సీఎం ఒక ప్రకటన సందేశంలో పేర్కొన్నారు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా గొప్ప పేరు పొందిన తర్వాత స్వజనుల సేవ కోసం, స్వరాజ్య సాధనలో భాగం కావడానికి 1915 జనవరి 9 న ముంబైకి తిరిగి వచ్చిన సందర్భానికి గుర్తుగా ఈ తేదీన ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని సీఎం రేవంత్​గుర్తుచేశారు. ప్రవాసుల పెట్టుబడులు, ఆలోచనలకు తెలంగాణ చక్కటి వేదికగా ఉండటమే కాదు, ప్రవాసీ ప్రజావాణి లాంటి వినూత్న కార్యక్రమాలతో గల్ఫ్, ఇతర దేశాల్లోని కార్మికుల సంక్షేమానికి కూడా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News