Kangana Ranaut: అలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించలేకపోయా.. కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut) నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’(Emergency).
దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut) నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’(Emergency). దీనికి ఆమెనే స్వయంగా దర్శకత్వం వహిస్తుండగా.. అనుపమ్ ఖేర్(Anupam Kher), శ్రేయాస్ తల్పడే, అశోక్ చబ్రా, మహిమ చౌదరి(Mahima Chaudhary) కీలక పాత్రలో నటించారు. అయితే ఈ మూవీ ఎన్నో వివాదాలు ఎదుర్కొని విడుదల వాయిదా పడింది. ఇక అన్ని కాస్త సర్దుమనగడంతో జనవరి 17న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ క్రమంలో.. కంగనా ప్రమోషన్స్‌లో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘‘నేను ఎమర్జెన్సీ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలనుకొని పెద్ద తప్పు చేశాను. దానికంటే ముందు డైరెక్ట్ చేయడం అతి పెద్ద తప్పుగా భావిస్తున్నాను. దీనిని ఓటీటీలో విడుదల చేసి ఉంటే అక్కడ మంచి డీల్ దొరికేది. ఈ సెన్సార్ బాధలు తప్పేవి. అసలు నాకు అర్థం కాని విషయమేంటంటే.. సెన్సార్ బోర్డు(Censor Board) నా చిత్రంలో కొన్ని సన్నివేశాలు తీసేసింది. అసలు అలా ఎందుకు చేయాలనుకుందో కానీ అవే కీలకమైన సీన్స్. అయితే వాటిని తీసేసినా నా సినిమా ధృడంగానే ఉంది.
గతంలో ఇందిరా గాంధీ(Indira Gandhi) రాజకీయాలపై ‘కిస్సా కుర్సీ కా’ మూవీ వచ్చింది. కానీ అది రిలీజ్ కాకుండానే బ్యాన్ చేయడంతో దానిని తెరకెక్కించిన డైరెక్టర్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ మూవీ స్క్రిప్ట్ పేపర్స్‌ను కూడా కాల్చేశారు. ఇక అప్పటి నుంచి ఆమె జీవిత కథను సినిమాగా తీసే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. నేను కూడా నాకు అలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించలేకపోయా. అసలు నా మూవీ రిలీజ్ అవుతుందని ఎవరూ నమ్మలేదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కంగనా కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.