స్టైలీష్ లుక్‌లో దర్శనమిచ్చిన స్టార్ హీరోయిన్.. నిన్నిలా చూస్తే దెబ్బకు అతను ప్లాట్ అంటూ కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-03-27 03:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’(Chalo) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. దీంతో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఇక ‘పుష్ప’(Pushpa) మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అదే ఫేమ్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది.

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) సరసన ‘యానిమల్’(Animal) సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే తెలుగులో కూడా రీసెంట్‌గా పుష్పకి సీక్వెల్‌గా సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప-2’(Pushpa-2) కూడా మంచి విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘సికిందర్’(Sikindar) మూవీలో నటిస్తోంది. సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా ఎ ఆర్ మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్(Kajal Agarwal) కీ రోల్ ప్లే చేస్తుంది. కాగా ఈ మూవీ మార్చి 30న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మందన్న. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

అందులో బ్లాక్ గాగూల్స్, ఇయర్ రింగ్స్ పెట్టుకుని స్టైలీష్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఇక వాటికి.. ‘ఉమ్.. నువ్వు అనవచ్చు..ఇదే నిజమైన నేను’ అనే క్యాప్షన్ రాసుకొస్తూ మంకీ ఎమోజీ యాడ్ చేసింది. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు నిన్ను ఇలా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) చూస్తే దెబ్బకు ప్లాట్ అయిపోతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

అలాంటి ఫొటో షూట్ చేసిన యాంకర్.. పెళ్లి అయ్యాక కూడా ఇలాంటివి అవసరం అంటారా అధ్యక్షా అంటూ మీమ్స్  


Tags:    

Similar News