మాసివ్ ఫ్రేమ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవట్లేదు అంటున్న నెటిజన్లు(పోస్ట్)
టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni), బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్(Sunny Deol) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’(JAAT).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni), బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్(Sunny Deol) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’(JAAT). పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని(Naveen Yerneni), వై రవిశంకర్(Ravi Shankar) నిర్మిస్తున్నారు. అయితే పలు హిట్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు రూపొందిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఈ చిత్రానికి ఎస్ తమన్(Thaman) బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. ఇందులో వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా(Randeep Hooda) కీ రోల్ ప్లే చేస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే ‘జాట్’ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ అందరిలో క్యూరియాసిటీని పెంచాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా జాట్ మూవీ షెట్స్ దగ్గరికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వెళ్లారు. అక్కడ సన్నీ డియోల్, డైరెక్టర్ గోపిచంద్ మలినేనిని కలిసి ఫొటోలకు స్టిల్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని మైత్రీ మూవీ మేకర్స్ షేర్ చేస్తూ.. ‘మాసివ్ ఫ్రేమ్ బాహుబలి మీట్ జాట్ అనే క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇక వీటిని చూసిన నెటిజన్లు వావ్ ఇద్దరు స్టార్ హీరోలను ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూడటానికి రెండు కళ్లు సరిపోవట్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.