‘జాట్’ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయిన యంగ్ బ్యూటీ.. ఇప్పుడు అవసరమా అంటున్న నెటిజన్లు

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni), బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్(Sunny Deol) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’(JAAT).

Update: 2025-03-27 04:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni), బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్(Sunny Deol) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’(JAAT). పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని(Naveen Yerneni), వై రవిశంకర్(Ravi Shankar) నిర్మిస్తున్నారు. అయితే పలు హిట్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు రూపొందిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఈ చిత్రానికి ఎస్ తమన్(Thaman) బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. ఇందులో వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే ‘జాట్’ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ అందరిలో క్యూరియాసిటీని పెంచాయి. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా(Randeep Hooda) ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీలో స్పెషల్ సాంగ్‌లో అలరించడానికి యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) ఫిక్స్ అయినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. హైదరాబాద్‌(Hyderabad)లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ సెట్‌లో ఈరోజు నుంచే ఈ సాంగ్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ న్యూస్ విన్న నెటిజన్లు హీరోయిన్‌గా రాణిస్తున్న టైంలో ఐటెం సాంగ్స్ అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

అలాంటి ఫొటో షూట్ చేసిన యాంకర్.. పెళ్లి అయ్యాక కూడా ఇలాంటివి అవసరం అంటారా అధ్యక్షా అంటూ మీమ్స్  


Full View

Tags:    

Similar News