Daaku Maharaj : డాకు మహరాజ్ టికెట్ల రేటు పెంపుపై నాగవంశీ కీలక వ్యాఖ్యలు
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్(Daaku Maharaaj).
దిశ, వెబ్ డెస్క్ : నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్(Daaku Maharaaj). ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ(Naga Vamsi), సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తెలంగాణలో ఈ సినిమా టికెట్ల రేట్లకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు నాగవంశీ. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని టికెట్ రేట్లు పెంచమని అడిగే ఉద్దేశం తమకు లేదని తేల్చి చెప్పారు. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను రాయలసీమలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలిపారు.
ఇదిలావుంటే ఈ సినిమాకు ఏపీలో టికెట్లు రేట్ల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఉదయం నాలుగు గంటల నుంచి బెనిఫిట్ షోలకు అనుమతినిస్తూ.. ప్రీమియర్ షో టికెట్ ధరలను రూ.500(జీఎస్‌టీతో కలిపి)గా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే విడుదలైన మొదటిరోజు నుంచి జనవరి 25 వరకు రోజుకు ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. ఈ షోలకు మల్టీప్లెక్సుల్లో టికెట్‌పై రూ.135, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.110 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.