రోజు ప్రాక్టీస్ చేస్తే తప్ప క్రికెట్లో రాణించడం సాధ్యం కాదు..

సమాజంలో ప్రతి ఒక్కరూ ఆటల పట్ల మక్కువ పెంచుకొని ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని, క్రీడల్లో పాల్గొనడం వల్ల ప్రతి మనిషికి మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవచ్చని, క్రీడల్లో క్రికెట్, ఫుట్బాల్ లాంటివి ఆడాలంటే చాలా శ్రమతో కూడుకున్న ఆటలని, వీటిలో ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలంటే ప్రతి రోజు ప్రాక్టీస్ చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

Update: 2025-01-08 13:17 GMT

దిశ, తలకొండపల్లి : సమాజంలో ప్రతి ఒక్కరూ ఆటల పట్ల మక్కువ పెంచుకొని ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని, క్రీడల్లో పాల్గొనడం వల్ల ప్రతి మనిషికి మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవచ్చని, క్రీడల్లో క్రికెట్, ఫుట్బాల్ లాంటివి ఆడాలంటే చాలా శ్రమతో కూడుకున్న ఆటలని, వీటిలో ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలంటే ప్రతి రోజు ప్రాక్టీస్ చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకుర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై క్రికెట్ పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో యువత పెడదారిన పడుతున్నారని, గంజాయి, మత్తు లాంటి వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంజాయి లాంటి మత్తు పదార్థాలను సరఫరా చేసిన వాడిన వ్యక్తుల పై ఉక్కుపాదం మోపాలని ఇప్పటికే పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల వ్యవధిలో 400 కోట్ల రూపాయల మద్యాన్ని అధికంగా సేవించారంటేనే మనం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకోవాలని, ప్రతి మనిషి బాధ్యతతో ముందుకు వెళ్లవలసిన అవసరం ఉందని అన్నారు. మనం ఒక్కసారి మన మనసులో ఏమి అనుకుంటున్నామో అదే అలవాటుగా మార్చుకొని నిబ్బరంగా ముందుకు వెళ్తే తప్ప మన జీవితానికి సార్థకత ఉండదని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు. అంతకు ముందు క్రీడాకారులకు దాతల సహకారంతో సమకూర్చిన క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News