రోడ్డు ప్రమాదంలో తల్లీ, కూతురు మృతి..

లారీ డ్రైవర్​ ర్యాష్​ డ్రైవింగ్​కు తల్లీ కూతుళ్లు దుర్మరణం పాలైన ఘటన పహాడీ షరీఫ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో బుధవారం తీవ్ర కలకలం రేపింది.

Update: 2025-01-08 15:02 GMT

దిశ, బడంగ్ పేట్​ : లారీ డ్రైవర్​ ర్యాష్​ డ్రైవింగ్​కు తల్లీ కూతుళ్లు దుర్మరణం పాలైన ఘటన పహాడీ షరీఫ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో బుధవారం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. పహాడీషరీఫ్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్​ కర్నూల్​ యెల్లికల్​ మండలానికి చెందిన తిమ్మరాసిపల్లి గ్రామానికి చెందిన చిట్టారి గోపాల్​ (34), చిట్టారి లక్ష్మమ్మ (32) లు దంపతులు. వీరికి చిట్టారి విజయ (14) సంతానం. కుమార్తె విజయకు ఎర్ర రక్త కణాల చికిత్స కోసం ఈ నెల 8వ తేదీన ఉదయం టీఎస్​ 31 ఈ 7437 నెంబర్​ గల హోండా షైన్ బైక్​పై గోపాల్​, లక్ష్మమ్మ, విజయలు బయలుదేరారు.

మార్గ మధ్యలో తుక్కగూడ అవుటర్​ రింగ్​ రోడ్​ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ డ్రైవర్​ ఒక్క సారిగా శంషాబాద్​ వైపు ఎడమ వైపునకు తిప్పడంతో బైక్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లి లక్ష్మమ్మ, కూతురు విజయలకు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతిచెందారు. భర్త చిట్టారి గోపాల్​కు కాలు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్​ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తల్లీ కూతుళ్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. తీవ్ర గాయాలపాలైన గోపాల్​ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును పహాడీషరీఫ్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News