Pullela Gopichand : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పుల్లెల గోపీచంద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిCM Revanth Reddy)ని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్(Pullela Gopichand) మర్యాదపూర్వకంగా కలిశారు.
దిశ, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిCM Revanth Reddy)ని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్(Pullela Gopichand) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గోపిచంద్ మాట్లాడుతూ.. స్పోర్ట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. క్రీడల పట్లరాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ(Sports University), స్పోర్ట్స్ అకాడమీ(Sports Academy) ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పలు పాలసీలు, చర్యలు తీసుకోవడం శుభ పరిణామం అని తెలియ జేశారు. తెలంగాణలో క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి తనవంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా గోపీచంద్ సీఎంకు హామీ ఇచ్చారు. కాగా స్టార్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ క్రీడాభివృద్ధికి తన సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.