Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ రిలీజ్.. మగాళ్లు అలా చేయొద్దంటూ బోరున ఏడుస్తున్న వెంకీ..
విక్టరీ వెంకటేష్(Venkatesh) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam).
దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్(Venkatesh) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఈ సినిమాకు అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ svcc బ్యానర్‌పై దిల్ రాజు(Dil Raju), శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వెరైటీగా ప్రేక్షకుల మనసులు గెలుచుకునేందుకు మూవీ టీమ్ పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
వరుస అప్డేట్స్‌తో పాటు అభిమానులకు దగ్గరయ్యేందుకు పలు ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా, నిజామాబాద్(Nizamabad)లో ఓ ఈవెంట్ నిర్వహించి ఇందులో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో..ఓ పొలిటీషన్ కిడ్నాప్ అవుతాడు. అది బయటపడితే ప్రభుత్వం కూలిపోతుందని ఉన్నత పదవిలో ఉన్న నరేష్.. మాజీ పోలీస్ అయిన వెంకటేష్‌ను తీసుకురావడానికి మీనాక్షి చౌదరిని పంపిస్తారు. ఇక అప్పటికే ఐశ్వర్యతో పెళ్లి అయి పిల్లలు కూడా ఉంటారు. మధ్యలోకి మీనాక్షి రావడంతో భార్య, ప్రేయసి మధ్యలో వెంకీ ఎంతలా నలిగిపోయాడో చూపించారు.
ఇద్దరితో కలిసి కిడ్నాప్ అయిన వ్యక్తిని పట్టుకునేందుకు వెళ్లగా వెంకటేష్‌ను చితకబాదుతారు. ఈ క్రమంలోనే రౌడీలు రావడంతో ప్రతి సినిమా రిలీజ్‌కు ముందుకు టీజర్ ఉన్నట్లు.. మగాళ్లకు పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది అని అంటాడు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఎక్కడో ఒక చోట ప్రేమకథ ఉండే ఉంటుంది. దయచేసి వాటిని మీ పెళ్లాలకు మాత్రం చెప్పకండి అని బోరున ఏడుస్తాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌లో అన్ని ఎమోషన్స్ ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.