అడ్వెంచర్ ఫ్యాంటసీ ‘కింగ్‌స్టోన్’ నుంచి డబుల్ అప్డేట్‌‌.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు, సింగర్ జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) సినిమాలతో పాటు సింగర్‌గా చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

Update: 2025-01-06 13:47 GMT

దిశ, సినిమా: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు, సింగర్ జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) సినిమాలతో పాటు సింగర్‌గా చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌స్టోన్’(Kingstone). దీనిని కమల్(Kamal) తెరకెక్కిస్తుండగా.. జీ స్టూడియోస్(Zee Studios), పార్లల్ పిక్చర్స్(Parallel Pictures) బ్యానర్స్‌పై జీవీ ప్రకాష్, ఉమేష్, బన్‌సాల్ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌ను కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) చేతుల మీదుగా విడుదల చేయించారు.

ఈ మేరకు ఆయన x ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. కింగ్‌స్టోన్ టీజర్ జనవరి 9న విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ జీవీ ప్రకాష్ ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు. ఇందులో ఆయన ఓ పెద్ద పడవలో నిల్చొని టార్చ్ పట్టుకుని ఏదో చూసి షాక్ అయినట్లుగా కనిపించారు. కింద మొత్తం కొంతమంది చేతులు చాచి ఉండగా.. పట్టుకుని పీక్కుతినేలా విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. అడ్వెంచర్ ఫ్యాంటసీగా రాబోతున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News