నాకు స్ఫూర్తి పవన్ కల్యాణ్.. ప్రముఖ నిర్మాత కామెంట్స్ వైరల్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Produced Dil Raju) నిర్మిస్తున్న చిత్రాల్లో ‘గేమ్ చేంజర్’ (Game Changer)ఒకటి.
దిశ, సినిమా: ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Produced Dil Raju) నిర్మిస్తున్న చిత్రాల్లో ‘గేమ్ చేంజర్’ (Game Changer)ఒకటి. శంకర్ దర్శకత్వంలో(Director Shankar) తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తుండగా.. కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ భారీ అంచనాల మధ్య జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. తాజాగా రాజమహేంద్రవరం(Rajamahendravaram)లో ప్రీ రిలీజ్ ఈవెంట్(Game Changer Pre release event)ను ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు స్ఫూర్తి పవన్ కల్యాణ్ అంటూ దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
‘పవన్ కల్యాణ్‌ను నేను ఎప్పుడూ ఒక స్ఫూర్తిగా చూస్తుంటా. ‘తొలిప్రేమ’ (Tholiprema)నుంచి ఆయనతో నా ప్రయాణం మొదలైంది. దాదాపు 25 ఏళ్ల ప్రయాణం మాది. కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన అలా ఎందుకు చేస్తున్నారని చాలామంది మాట్లాడుకున్నారు. అందులో నేను కూడా ఒకడిని. రాజకీయాల్లోకి అడుగుపెట్టగానే ఆయనేమీ విజయాన్ని అందుకోలేదు. పరాజయం వచ్చినా ఆయన ఎక్కడా ఆగలేదు. ఎంతో శ్రమించారు. ఇటీవల 21 సీట్లకు 21 గెలుచుకొని ఘన విజయాన్ని అందుకున్నారు. ఆయనే నిజమైన గేమ్ చేంజర్. సక్సెస్ రాలేదని, ఎక్కడా ఆగకూడదని శ్రమిస్తే విజయం తప్పక వరిస్తుందని ఆయన్ని చూశాకే అర్థమైంది. వకీల్‌సాబ్ సినిమా వల్ల వచ్చిన పారితోషికం తమ పార్టీకి ఒక ఇంధనంగా పనిచేసిందని ‘గేమ్ చేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆయన నా గురించి చెప్పిన మాటలు విని నాకు కన్నీళ్లు వచ్చేశాయి. ఆయన ఆ విషయాన్ని చెబుతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి గుర్తుపెట్టుకొని ఆవిధంగా మాట్లాడటం నిజంగా ఆనందాన్ని ఇచ్చింది. ఆయనకు నా పాదాభివందనం’’ అని దిల్ రాజు అన్నారు.
Read More...
AP News:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి తీవ్ర విమర్శలు?