Balakrishna: డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ న్యూ స్టిల్స్ వైరల్..
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’.
దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ మూవీ కోసం ఫ్యాన్స్‌తో పాటు సిని ప్రేమికులు కూడా ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా.. ‘డాకు మహారాజ్’ నుంచి ఏ ఒక్క అప్‌డేట్ (Update) వచ్చిన అది క్షణాల్లో వైరల్ కావడంతో కామెంట్స్‌తో సందడి చేస్తున్నారు మూవీ లవర్స్ (Movie lovers). అలాగే ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకుంది.
ముఖ్యంగా సాంగ్ (Song) పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్నాయి. ఇక రీసెంట్‌గా రిలీజైనా సాంగ్ ‘దబిడి దిబిడి’ అయితే.. వేరే లెవల్‌లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి వర్కింగ్ స్టిల్స్ (Working stills) కొన్ని సోషల్ మీడియా (Social media)లో వైరల్ అవుతున్నాయి. ఇది ‘డాకు మహారాజ్’లోని ఫైటింగ్ స్టిల్ (Fighting Still) అని క్లియర్‌గా తెలుస్తుండగా.. బాలయ్య బాబు ఓ చేతిలో పొడవాటి రాడ్డు పట్టుకోగా.. దానిపై విలన్ పడి ఉండగా అతడికి రోప్స్ సపోర్ట్‌గా ఉన్నాయి. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.