Pawan Kalyan: రామ్ చరణ్‌ది ‘హనుమంతుడి’ లాంటి స్వభావం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రశంసల వర్షం కురిపించారు.
దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రశంసల వర్షం కురిపించారు. శనివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎవరూ మూలాలు మర్చిపోకూడదని అన్నారు. ఎక్కడినుంచి వచ్చామో నిత్యం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఎంత ఎదిగినా కొద్ది ఒదిగి ఉండటం నేర్చుకోవాలని అన్నారు. చిన్నతనంలో శంకర్ సినిమాలు బ్లాక్‌లో టికెట్లు కొనుక్కొని వెళ్లేవాడిని అని గుర్తుచేశారు. తమిళ దర్శకుడు అయినా.. శంకర్ సినిమాలను మన సినిమా అనే అనుకున్నామని తెలిపారు. తెలుగు ప్రజలు శంకర్ సినిమాలను గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ఆయన గేమ్ ఛేంజర్ సినిమాను నేరుగా తెలుగులో తీయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
జనసేన పార్టీ నడపటానికి ఇంధనంగా పనిచేసిన వకీల్ సాబ్ సినిమా(Vakeel Saab Movie)ను తీసిన దిల్ రాజుకు ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. రామ్ చరణ్ పుట్టినప్పుడు తాను ఇంటర్ చదువుతున్నానని.. రామ్ చరణ్‌కు ఆ పేరు పెట్టింది మా నాన్న అని గుర్తుచేసుకున్నారు. హనుమంతుడిలా ఉండాలని రామ్ చరణ్‌కు ఆ పేరు పెట్టారని తెలిపారు. అది రామ్ చరణ్‌లో కనిపిస్తోందని.. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడని, తన శక్తి సామర్థ్యం ఏంటో కూడా తనకు తెలియదని అన్నారు. రామ్ చరణ్ నాకు తమ్ముడి లాంటి వాడని చెప్పుకొచ్చారు. చాలా బాధ్యతగా ఉంటాడని తెలిపారు. రంగస్థలం సినిమా(Rangasthalam Movie)కు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని అనుకున్నా.. కానీ ఏదో రోజు తప్పకుండా నేషనల్ అవార్డు సాధిస్తాడనే నమ్మకం ఉందని అన్నారు. చిరంజీవి మూలంగా ఇవాళ తామంతా మంచి పొజీషన్‌లో ఉన్నామని తెలిపారు.
ఆయన ఎంతో కష్టపడి మా అందరినీ ఈ స్థాయిలో ఉండేలా చేశాడని అన్నారు. తమ కుటుంబ బాధ్యతను తీసుకొని.. సుఖం లేకుండా రాత్రుళ్లు కూడా ఎంతో కష్టపడి షూస్ విప్పకుండానే పడుకునే వాడని అన్నారు. ఆయన్ని అలా చూశాడు.. కాబట్టి జీవితాంతం ఒదిగే ఉంటాడని అన్నారు. చిత్ర పరిశ్రమలకు రాజకీయాలు పూయడం మాకు ఇష్టం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. అభిమానులంతా సేఫ్‌గా ఇంటికి వెళ్లాలని కోరారు. అందరూ బాగుండాలని అన్నారు.
Read More...
Ram Charan: భారత రాజకీయాల్లో నిజమైన ‘గేమ్ ఛేంజర్’ పవన్ కల్యాణ్