Road Accident:సైకిల్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి దుర్మరణం
జీలుగుమిల్లి మండలం దర్భ గూడెంలో అతి వేగంగా వచ్చిన లారీ ముందు వెళ్తున్న సైకిల్‌ను వెనుక నుంచి ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు.
దిశ, జీలుగుమిల్లి: జీలుగుమిల్లి మండలం దర్భ గూడెంలో అతి వేగంగా వచ్చిన లారీ ముందు వెళ్తున్న సైకిల్‌ను వెనుక నుంచి ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెం జాతీయ రహదారిపై గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దర్భ గూడెం గ్రామానికి చెందిన పైడి మర్ల సోమిరెడ్డి (70) నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి జంగారెడ్డిగూడెం వెళ్లి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి తిరిగి దర్భ గూడెం వచ్చి సెంటర్లో పెట్టిన సైకిల్ తీసుకొని ఇంటికి వెళుతున్నాడు.
ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న ఏపీ 39 టియన్ 1819 నెంబర్ గల లారీ సైకిల్ని డి కొట్టడంతో పైడిమర్ల సోమిరెడ్డి లారీ వెనుక చక్రాల కింద పడిపోయాడు. దీంతో తల పగిలి ఛిద్రమైపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి నవీన్ కుమార్ తెలిపారు.