Official: ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా DCM పవన్ కల్యాణ్
‘గేమ్ ఛేంజర్’ సినిమా(Game Changer Movie) ప్రీరిలీజ్ ఈవెంట్‌పై చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ‘గేమ్ ఛేంజర్’ సినిమా(Game Changer Movie) ప్రీరిలీజ్ ఈవెంట్‌పై చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. జనవరి 4వ తేదీన రాజమండ్రి(Rajahmundry) వేదికగా ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఫంక్షన్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్, నవీన్‌చంద్ర, సముద్రఖని, ఎస్.జె. సూర్య కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం సాయంత్రం ఏఎంబీ సినిమాస్‌లో ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
A power packed pre release event for #GameChanger🔥 to be graced by the honorable Deputy CM of Andhra Pradesh @pawankalyan garu✨
— Game Changer (@GameChangerOffl) January 2, 2025
The #MegaPowerEvent is going to be MASSIVE
🗓️ 4th January
📍 Rajahmundry#GameChangerOnJanuary10🚁
Global Star @AlwaysRamCharan @shankarshanmugh… pic.twitter.com/P653XEcQYu