సజ్జలకి బిగ్ షాక్ .. సమగ్ర విచారణకు పవన్ ఆదేశం
మాజీ ప్రభుత్వ సలహారు సజ్జల రామకృష్ణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిగ్ షాక్ ఇచ్చారు...
దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కింద స్థాయి కార్యకర్తల నుంచి నెంబర్ 2 అని పిలుపించుకున్న వాళ్లు సైతం అవినీతికి పాల్పడ్డారు. అప్పట్లో పత్రిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నా అధికార మత్తులో పట్టించుకోలేదు. ప్రభుత్వం మారడంతో ఆ పాపాలు రోజుకొకటి బయట పడుతున్నాయి. తాజాగా మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Former Government Advisor Sajjala Ramakrishna Reddy) చేసిన అక్రమం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) సీరియస్ అయ్యారు. సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు.
కడప జిల్లా సీకే దిన్నె(Kadapa District CK Dinne) రెవెన్యూ పరిధిలోని 1599, 1600/1, 2, 1601/1, 12, 255 పాటు ఇతర సర్వే నెంబర్లలోని భూములు సజ్జల కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నాయి. అయితే 42 ఎకరాల అటవీ భూముల(Forest lands)ను సజ్జల ఫ్యామిలీ ఆక్రమించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సమగ్ర విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని కడప జిల్లా కలెక్టర్‌ను పవన్ కల్యాణ్ ఆదేశించారు. ‘ఎవరి ఆధీనంలో ఉన్నాయి..?, వన్యప్రాణులకు ఎలాంటి హాని కలిగింది..?’ వంటి అంశాలపై విచారణ జరపాలని సూచించారు. అంతేకాదు అటవీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు డిప్యూటీ సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.