అప్రమత్తమయ్యాం.. వేటు వేశాం: పీఏ అవినీతిపై అనిత ఆగ్రహం

అవినీతి ఆరోపణలతో వేటుకు గురైన పీఏ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందించారు..

Update: 2025-01-05 06:00 GMT

దిశ, వెబ్ డెస్క్: అవినీతి ఆరోపణల నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) ప్రైవేటు పీఏ జగదీశ్‌పై వేటు పడిన విషయం తెలిసిందే. అయితే పీఏ జగదీష్ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందించారు. విశాఖ సెంట్రల్ జైలు(Vishaka Central Jail)ను తనిఖీలు చేసిన ఆమె మీడియాతో మాట్లాడారు. తన పీఏ జగదీశ్‌ వ్యవహారాలు తెలిసి అప్రమత్తమయ్యామని చెప్పారు. గతంలో రెండుసార్లు పీఏని హెచ్చరించామని తెలిపారు. పదేపదే ఆరోపణలు రావడంతో 10 రోజుల క్రితమే పీఏని తొలగించామన్నారు. పార్టీ, ప్రభుత్వానికి నష్టం జరిగితే ఊరుకోమని అనిత హెచ్చరించారు. 

Tags:    

Similar News