Hindu Sankharavam Sabha : నేడు హైందవ శంఖారావం సభ..కాషాయమయమైన విజయవాడ
నేడు విజయవాడలో హైందవ శంఖారావం బహిరంగ(Hindu Sankharavam Sabha) సభకు భారీ ఏర్పాట్లు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేసరపల్లి వద్ద విశ్వహిందూ పరిషత్(Vishwa Hindu Parishad)ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సభకు దేశ వ్యాప్తంగా సాధువులు, మఠాధిపతులు, హిందూ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వారి రాక కోసం 15 ప్రత్యేక రైళ్లు, వేలాదిగా బస్సులను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. దాదాపు 5 లక్షల మంది ఈ సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి(Autonomy for temples)కల్పించడమే లక్ష్యంగా హైందవ శంఖారావం సభను నిర్వహిస్తున్నారు.
సభ ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం వైపు నుంచి దాదాపు 3,300 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. హైందవ శంఖారావం బహిరంగ సభ ఏర్పాట్లతో విజయవాడ కాషయమయంగా మారింది. ర్యాలీలుగా వస్తున్న వారు జైశ్రీరామ్, హరహర మహాదేవ్..జైభజరంగ్ బలి నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సభలో ప్రధానంగా దేవాలయాలను ఎండోమెంట్ నుంచి తప్పించి స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్ తో పాటు హిందువులపైన, గుడులపైన దాడులు వంటి అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.