హైదరాబాద్‌కు ఏపీ సీఎం.. షెడ్యూల్ ఇదే..!
హైదరాబాద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు..
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్(Hyderabad)కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) రానున్నారు. ఇవాళ నగరంలో జరిగే ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహా సభల్లో(World Telugu Federation 12th Biennial International Conference) ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 5వ తేదీ వరకూ జరగబోయే ఈ సభలు నేడు ప్రారంభంకానున్నాయి. హెచ్ఐసీసీ నోవాటెల్(HICC Novatel)లో జరిగే ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Former Vice President Venkaiah Naidu), కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) సహా తదితర ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఈ నెల 5వ తేదీని జరిగే ముగింపు కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) కూడా ఈ సభలకు హాజరుకానున్నారు. చిత్ర పరిశ్రమ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, జయసుధ, మురళీమోహన్‌తో పాటు విదేశీల్లో ఉన్న తెలుగు సంఘాల నాయకులు కూడా ఈ సభల్లో పాల్గొనున్నారు.
ఇక తెలుగుదనం ఉట్టిపడేలా ఈ సభలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కూచిపూడి నృత్యం, జానపద పదర్శనలు, సినీ సంగీతం, తెలుగు చేనేత వస్త్ర ప్రదర్శనలతో పాటు సాహితీ రూపకాలు, భాష, సంస్కృతులపై పలువురు ప్రముఖులు ప్రసంగం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.