Ap News: నెల్లూరులో ఐదు రోజుల పండగ.. మంత్రి నారాయణ కీలక ఆదేశాలు
నెల్లూరు టౌన్ బారాషహీద్ దర్గాలో రొట్టెల పండగ నిర్వహణపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు...
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు టౌన్ బారాషహీద్ దర్గాలో ప్రతి ఏడాది రొట్టెల పండగ ఘనంగా జరిగే విషయం తెలిసిందే. ఈ ఏడాది అంతకు మించి నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రొట్టెలు జులై 17న రొట్టెల పండగ సందర్భంగా అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. పారిశుధ్యం, తాగునీరు, పార్కింగ్ వంటి సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే పండగ నిర్వహణకు మాస్టర్ ప్లాన్ రెడీ చేయాలని సూచించారు. నెల్లూరు జిల్లాలోని దర్గాలు, మసీదుల వద్ద మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.
కాగా నెల్లూరులో ఐదు రోజుల పాటు జరిగే ఈ పండగలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాక దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి దర్గాను సందర్శిస్తారు. స్వర్ణల చెరువు నీళ్లను తలపై చల్లుకుని రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటారు. పలు కోరికలు కోరుకుని చెరువులో రొట్టెలు వదలడం, పట్టుకోవడం చేస్తారు. కోరిక తీరితే వచ్చే ఏడాది పండుగలో రొట్టెను చెరువులో వదిలేయడం చేస్తారు. ఈ పండగలో మహిళలు భారీగా పాల్గోంటారు. మొత్తం 10 లక్షలకు పైగా భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.