Tirumala: లక్ష్మీనరసింహస్వామికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం

తిరుమల పరిధిలోని లక్ష్మీ నరసింహస్వామికి వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు..

Update: 2023-12-10 16:03 GMT

దిశ, తిరుమల:తిరుమల పరిధిలోని లక్ష్మీ నరసింహస్వామికి వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసిన లక్ష్మీనరసింహస్వామికి ప్రతి ఏడాది కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామి వారికి అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ముందుగా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో కూడిన స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.


Similar News