Tiger: ఆ ఊరిలో భయం.. భయం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేగింది....

Update: 2024-12-09 15:13 GMT

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పెద్దపులి సంచారం(Tiger Migration) కలకలం రేగింది. పెదబాపన్నదార పరిసర అటవీ ప్రాంతంలో ఆదివారం ఆవు(Cow)ను అడవి జంతువు(Animal) చంపి తినింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది పెద్దపులి పాదముద్ర(Footprint)లను గమనించారు. పరీక్షలు చేయడంతో పెద్దపులి పాదముద్రలని నిర్ధారించారు. ఈ మేరకు స్థానికులకు బిగ్ అలర్ట్ ప్రకటించారు. పెదబాపన్నదార పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్దపులిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. రాత్రి సమయంలో అసలు బయటకు రావొద్దని, పగటి సమయంలో ఒంటరిగా తిరగొద్దని తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. 

Tags:    

Similar News