విజయవాడలో భారీ వర్షం..సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం

ఏపీలో వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి.

Update: 2024-09-07 08:45 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. రహదారులు, పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ భారీ వర్షాల వల్ల విజయవాడ(Vijayawada)ను వరదలు(Floods) ముంచెత్తాయి. ఇళ్లలోకి వరద(Floods) నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా బుడమేరు వరద(Budameru Flood) తగ్గుముఖం పడుతుందనుకున్న లోపే మళ్లీ భారీ వర్షం మొదలైంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు వరద బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బెజవాడలో మళ్లీ కుండపోత వర్షం కురుస్తోంది. భవానీపురం, విద్యాధరపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, వన్ టౌన్, గవర్నర్ పేట, లబ్బీపేట, మొగల్రాజపురం, పటమట, కష్ణలంక, కానూరు తదితర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వాన పడుతోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మళ్లీ వరద పెరుగుతుందేమోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ ఏకధాటిగా వర్షం కురుస్తోంది.


Similar News