Tirumala Samacharam: తిరుమలలో పెరుగుతోన్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల క్రమంగా పెరుగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల క్రమంగా పెరుగుతోంది. శనివారం శ్రీవారిని దర్శనానికి జనం ఓ మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 6 నంచి 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటలకు పైగానే సమయం పడుతోంది.
అదేవిధంగా ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఎవరూ లేకపోవడంతో అధికారులు శ్రీవారి దర్శనానికి నేరుగా పంపుతున్నారు. శనివారం స్వామి వారిని 77,884 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 27,418 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.327 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.