Fraud: అధిక వడ్డీల పేరుతో ఘరానా మోసం.. వందల్లో మోసపోయిన బాధితులు

సామన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) విచ్చలవిడిగా మోసాలకు తెగబడుతున్నారు.

Update: 2024-10-27 03:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: సామన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) విచ్చలవిడిగా మోసాలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ (Whatsaap), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం (Social Media Faltforms)లలో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారు. క్యూఆర్ కోడ్స్ (QR Codes), వెబ్ లింకు (Web Links)లతో అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. మరికొందరు కేటుగాళ్లు ఎలాంటి కండీషన్లు లేకుండా లోన్లు (Loans) ఇస్తామని, స్టాక్ మార్కెట్ల (Stock Markets)లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మబలికి జనాలను నిండా ముంచేస్తున్నారు. మరికొందరు తమ వద్ద పెట్టుబడి పెడితే అధిక వడ్డీ ఇస్తామని చెప్పి అందరి వద్ద డబ్బు వసూలు చేసి ఊడాయిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా (Eluru District) ద్వారకా తిరుమల (Dwaraka Tirumala)లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తమ యాప్‌లో పెట్టుబడి పెడితే.. అధిక వడ్డీ వస్తుందని చెబుతూ కొందరు కేటుగాళ్లు రంగంలోకి దిగారు. యాప్ ద్వారా రూ.20 డిపాజిట్ చేస్తే రోజుకు రూ.750 వడ్డీ వస్తుందని అమాయక ప్రజలకు నమ్మబలికారు. దీంతో ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) పరిధిలో దాదాపు 200 మందికి పైగా బాధితులు యాప్‌లో పెట్టుబడులు పెట్టారు. కాగా, గత 15 రోజులుగా యాప్ పని చేయకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాము నిలువునా మోసపోయినట్లుగా గ్రహించిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. 

Tags:    

Similar News