వరకట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య

వరకట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని దేవక్కపల్లి గ్రామంలో పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-12-22 15:28 GMT

దిశ,బెజ్జంకి : వరకట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని దేవక్కపల్లి గ్రామంలో పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని దేవక్కపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీకాంత్ తో చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన అశ్విని(27)తో 2020లో జరిగింది. వీరికి ఒక కొడుకు, పెళ్లి సమయంలో అనుకున్న విధంగా కట్నం తల్లిదండ్రులు అందజేశారు. శ్రీకాంత్ ఎటువంటి పని చేయకుండా జులాయి గా తిరుగుతూ రోజు ఖర్చులకోసం అశ్విని తల్లి గారి ఇంటి దగ్గర ఉండి డబ్బులు తేవాలని వేధించేవాడు. అతని వేధింపులు భరించలేక ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు బంధువులు అశ్విని మృతిపై అనుమానాలు వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. వరకట్నం వేధింపులతో మృతి చెందినట్లు మృతురాలి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి డెడ్ బాడీని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం పంపినట్లు ఎస్సై తెలిపారు.


Similar News