Breaking: ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీల గడువును మరోసారి పొడిగించింది. ఈ నెల 22 వరకు బదిలీల గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-09-12 11:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీల గడువును మరోసారి పొడిగించింది. ఈ నెల 22 వరకు బదిలీల గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 23 వరకు బదిలీపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇక ఎక్సైజ్ శాఖలోనూ సెప్టెంబర్ 30 వరకు బదిలీల గడువును పొడిగించింది. అక్టోబర్ 1 వరకు ఎక్సైజ్ శాఖలో బదిలీలపై నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఎక్సైజ్ శాఖలో ఉన్న సెబ్‌ను రద్దు చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో 15 రోజుల పాటు ఉద్యోగుల బదిలీల గడువును పెంచింది. కాగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్)ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం సెబ్‌ను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన 12 జీవోలను బుధవారం రద్దు చేసింది. అలాగే సెబ్‌కు గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. వారందరిని వెంటనే ఎక్సైజ్‌ శాఖలో రిపోర్ట్‌ చేయాలని సెబ్‌ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కాగా గత ప్రభుత్వం ఎక్సైజ్‌ శాఖలో 70శాతం ఉద్యోగులు, సిబ్బందిని సెబ్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే.


Similar News