Jagan vs Sharmila: చంద్రబాబుతో షర్మిల లాలూచీ.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు కళ్లలో ఆనందం చూసేందుకే షర్మిల.. జగన్ పై విమర్శలు చేస్తోందని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. మళ్లీ జగన్ సీఎం కాకుండా కుట్రపన్నారని విమర్శించారు.

Update: 2024-10-27 06:19 GMT
Jagan vs Sharmila: చంద్రబాబుతో షర్మిల లాలూచీ.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan), షర్మిల (Sharmila) మధ్య జరుగుతున్న ఆస్తి తగాదా వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఆమెకు ఇవ్వాల్సిన ఆస్తి కాకుండా జగన్ తన సొంత పెట్టుబడితో సంపాదించిన ఆస్తిలో వాటా ఇచ్చేందుకు ఎంఓయూ (MOU) చేసుకున్నారని, కానీ.. షర్మిల, విజయమ్మ కావాలనే జగన్ ను ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల నిన్న ప్రెస్ మీట్ పెట్టి.. జగన్ పై మరోసారి ఆరోపణలు చేశారు. తన సొంత ఆస్తి పంచుతున్నట్లు వచ్చిన కామెంట్స్ ను ఖండించారు.

షర్మిల చేసిన విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయి (MP Vijayasai Reddy) రెడ్డి కౌంటరిచ్చారు. అన్నను తిట్టేందుకే షర్మిల ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఆరోపించారు. ఇది ఆస్తి తగాదా కాదని, అధికారం కోసం జరుగుతున్న తగాదా అన్నారు. చంద్రబాబు (Chandrababu) కళ్లలో ఆనందం చూసేందుకే షర్మిల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ను మళ్లీ సీఎం కాకుండా అడ్డుకోవాలని కుట్ర పన్నారని, ఈ మేరకు షర్మిల లాలూచీ పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Tags:    

Similar News