ఏపీ హైకోర్టుకు నలుగురు జడ్జీలు

ఏపీ హైకోర్టుకు కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

Update: 2023-10-11 09:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ హైకోర్టుకు కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు జడ్జిలుగా నలుగురిని సిఫారసు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జస్టిస్ హరినాథ్, జస్టిస్ ఎం. కిరణ్మయి, జస్టిస్ జె.సుమతి, జస్టిస్ ఎన్.విజయ్ లను హైకోర్టు జడ్జిలుగా కొలీజియం సిఫారసు చేసింది. త్వరలోనే ఈ నలుగురు న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించనున్నట్లు సుప్రీంకోర్టు కొలీజియం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన ఈ నలుగురు జడ్జిలు గతంలో న్యాయవాదులుగా వ్యవహరించినట్లు కొలీజియం స్పష్టం చేసింది. అయితే ఈ న్యాయవాదులను జడ్జిలుగా నియమించాలని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇద్దరు సీనియర్ జడ్జిలు సంప్రదింపులు జరిపి, ఆ మేరకు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలకు ఏపీ సీఎం జగన్, గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. అనంతరం సుప్రీంకోర్టు సైతం వారి నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే ఇటీవల ఏపీ హైకోర్టు నుంచి పలువురు న్యాయమూర్తుల బదిలీపై ఇతర రాష్ట్రాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News