YS Jagan:పార్టీ నేతలతో కాసేపట్లో భేటీ కానున్న మాజీ సీఎం

ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-12-04 07:55 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతం దిశగా వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు(బుధవారం) వైఎస్ జగన్ తాడేపల్లిలోని వైసీపీ ఆఫీస్‌(YCP Office)లో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భాగంగా పార్టీని బలోపేతం చేసే అంశంతో పాటు.. కూటమి ప్రభుత్వం పై ప్రజా పోరాటం ఎలా చేయాలనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. పార్టీకి సంబంధించిన కమిటీల ఏర్పాటు గురించి చర్చించనున్నారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై వైఎస్ జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ భేటీకి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, జనరల్ సెక్రటరీలు, కార్యదర్శులు హాజరుకానున్నారు.

Tags:    

Similar News