Factory Seize: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి బిగ్ షాక్.. ఆ ఫ్యాక్టరీని సీజ్ చేసిన పీసీబీ అధికారులు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ (YCP) నేతల్లో గుబులు మొదలైంది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ (YCP) నేతల్లో గుబులు మొదలైంది. ఐదేళ్లు అధికారంలో ఉండి ఆ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు, భూ కబ్జాలు, అక్రమ వ్యాపారాలపై తాజాగా సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (Former MLA Dwarampudi Chandrashekar Reddy)కి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు బిగ్ షాకిచ్చారు. ప్రత్తిపాడు (Prathipadu) మండల పరిధిలోని లంపకలోవ (Lampakalova)లో ఆయన రొయ్యల ఫ్యాక్టరీ (Shrimp Factory)ని అధికారులు సీజ్ చేశారు.
పర్యావరణానికి హానీ కలిగిస్తూ.. నిబంధనలను ఉల్లంఘించి ఫ్యాక్టరీ నడుపుతున్నట్లుగా అధికారుల విచారణలో వెల్లడైంది. రొయ్యల పెంపకంతో వచ్చే కాలుష్య వ్యర్థ జలాలను ఏమాత్రం రీసైక్లింగ్ (Recycling) చేయకుండా నేరుగా బయటకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (Pollution Control Board)కు తప్పుడు సమాచారం ఇస్తూ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నట్లుగా వెల్లడైంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్యాక్టరీలోని ఓ విభాగంగా ఐస్ ప్లాంట్ నిర్వహిస్తున్నట్లుగా బట్టబయలైంది. వాటన్నింటినీ సరిదిద్దుకునేందుకు కాలుష్య నియంత్రణ మండలి (PCB) మూడు నెలల పాటు సమయం ఇచ్చినా.. ఎలాంటి మార్పు రాకపోవడంతో అధికారులు తాజాగా ఫ్యాక్టరీని సీజ్ చేసి నోటీసులు జారీ చేశారు.