EVM ట్యాంపరింగ్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన ఆరోపణలు

ఏపీలో కూటమి ఘన విజయంపై తమకు అనుమానాలు ఉన్నాయని వైసీపీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు.

Update: 2024-06-07 06:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ఘన విజయంపై తమకు అనుమానాలు ఉన్నాయని వైసీపీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పక్కా గెలుస్తాం అనుకున్న 80 స్థానాల్లో వెనుకబడ్డామన్నారు. పొలిటికల్ స్ట్రాటజీస్ట్ ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ముందే వైసీపీకి 15 సీట్ల కన్నా ఎక్కువ రావని చెప్పారని గుర్తుచేశారు. ప్రొడ్యూసర్ టీడీపీ కూటమికి 160 సీట్లు వస్తాయని చెప్పారని తెలిపారు. కేకే సర్వే అలయెన్స్‌కు 161 సీట్లు వస్తాయని చెప్పిందని స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు సైతం ఖచ్చితంగా 160 వస్తాయని చెప్పారని తెలిపారు. ఓటు వేసే వరకు ప్రజలు భయటపడలేదని.. మరి వీరందరికి ఎలా తెలిసిందని అనుమానం వ్యక్తం చేశారు. సెలెక్ట్‌డ్ ప్లేస్‌లలో ట్యాంపరింగ్ చేసినట్లు ఏపీ ప్రజలకు అనుమానం ఉన్నాయని కేతిరెడ్డి ఆరోపించారు. 


Similar News