మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. స్పందించిన మంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. విజయనగరం(vijayanagaram) జిల్లాలో మూడున్నరేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడి(Sexual assault) చేశాడు.

Update: 2024-10-28 13:58 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. విజయనగరం(vijayanagaram) జిల్లాలో మూడున్నరేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడి(Sexual assault) చేశాడు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లికి చెందిన దంపతులు తమ కూతురు తో కలిసి గంట్యాడ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన బంధువుల ఫంక్షన్ కి వెళ్లారు. అయితే అదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి.. బాలికను ఆడిస్తూ.. పక్కనే ఉన్న తోటలోకి తీసుకెళ్లి లైంగికదాడి(Sexual assault)కి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కాగా ఈ ఘటన సమాచారం అందుకున్న స్థానిక మంత్రి సంధ్యారాణి(Minister Sandhyarani).. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. లైంగిక దాడి చేసిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని సీఎం(CM) ఆదేశించారు. నిందితుడికి బెయిల్ వచ్చేలా రక్షణ కల్పించొద్దని న్యాయవాదులను కోరుతున్నానని అన్నారు. బాలికతో పాటు తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు.


Similar News