Good News : ఏపీలో ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్

ఏపీ(AP) కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేస్తోంది.

Update: 2024-10-28 13:56 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP) కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేస్తోంది. దీపావళి(Diwali) కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు(Free Gas Sylinders) అందివ్వనుంది. అర్హులైన మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఇవ్వనున్నట్లు ఇది వరకే ప్రకటించింది. అయితే ముందుగా పూర్తి ధరను చెల్లించి తీసుకుంటే తర్వాత సిలిండర్ ధర మొత్తాన్ని లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయనుంది. మూడు సిలిండర్లలో ఒకదానికి సంబంధించిన రాయితీ మొత్తం రూ. 895 కోట్ల విడుదలకు అనుమతి మంజూరు చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లకు ఏడాదికి రూ. 2,684 కోట్లు అవుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేస్తోంది. ఇక ఈ పథకాన్ని "దీపం"(Deepam) అనే పేరుతో రానున్న దీపావళి రోజున ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది. 

Tags:    

Similar News