Attack on TDP office : పానుగంటి చైతన్య కేసులో కోర్ట్ కీలక నిర్ణయం

టీడీపీ(TDP) పార్టీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా(A1) ఉన్న పానుగంటి చైతన్య(Panuganti Chaithanya) కేసులో కోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-28 11:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ(TDP) పార్టీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా(A1) ఉన్న పానుగంటి చైతన్య(Panuganti Chaithanya) కేసులో కోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో చైతన్యకు గుంటూరు అడిషనల్ కోర్ట్ 14 రోజులపాటు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన మూడు రోజుల కస్టడీ ముగియడంతో నేడు అడిషనల్ కోర్టు ముందు నిందితుణ్ణి హాజరు పరిచారు. కాగా కస్టడీలో చైతన్య పోలీసులకు సహకరించలేదని.. విచారణలో తెలియదు, మర్చిపోయాను అనే సమాధానాలు ఇచ్చినట్టు పోలీసులు కోర్టుకు తెలియజేశారు. ఈ క్రమంలో కోర్ట్ చైతన్యకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేయగా.. పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు.  


Similar News