శ్రీనివాసుడే నాకు పునర్జన్మనిచ్చారు.. లడ్డూ వివాదంపై మరోసారి స్పందించిన చంద్రబాబు

తిరుమల శ్రీవారితో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు...

Update: 2024-09-22 14:13 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారితో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu) తెలిపారు. శ్రీనివాసుడే తనకు పునర్జన్మ ప్రసాదించారని ఆయన స్పష్టం చేశారు. గతంలో వైఎస్సార్ రాజశేఖరరెడ్డి (Ys Rajasekhara Reddy) ఏడుకొండలను ఐదు కొండలు చేస్తానని చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పట్లో తాను తీవ్రంగా ఖండించానని ఆయన తెలిపారు. పవిత్రమైన క్షేత్రంలో ఐదేళ్లు అపవిత్ర కార్యక్రమాలు చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయాలకు తిరుమల కొండను ఒక పునరావాసంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో భక్తుల మనోభావాలకు విలువలేదని, ప్రసాదం నాణ్యతనూ అపవిత్రం చేశారని, చాలా సార్లు భక్తులు అందోళన చేశారని చంద్రబాబు గుర్తు చేశారు.

‘‘తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేక ఉంది. 300 ఏళ్ల నుంచి శ్రీవారి లడ్డూ (Srivari Laddu) ఒక రెసిపి. లడ్డూ తయారీలో పోషక పదార్థాలు వాడాతారు. పదార్థాలన్ని నాణ్యతగా ఉంటాయి. దేవుడికి ఇస్తున్నామనే పవిత్రమైన భావనతో పదార్థాలు ఇస్తారు. ప్రసాదం మంచి వాసన వస్తుంది. లడ్డూ, జిలేబీ, వడ, పొంగలి దేనికదే ప్రత్యేకత. తిరుమల(Tirumala) కొండపై భోజన ప్రసాదం సైతం రుచికరంగా ఉంటుంది. లక్ష మంది భక్తులకు భోజనం పెడుతున్నారు. నాణ్యతపై అధికారులతో చాలాసార్లు రివ్యూ చేశాం. తొమ్మిదేళ్లలో ఎప్పుడు తిరుపతి వెళ్లినా అధికారులతో సమీక్షలు నిర్వహించాం. తిరుమల చుట్టూ ఆయుర్వేద ప్లాంట్స్ ఏర్పాటు చేశాం. తిరుపతి లడ్డూకు చాలా డిమాండ్ ఉంది. లడ్డూ 150 గ్రాములుంటుంది. 40 గ్రాములు ఆవు నెయ్యి, 40 గ్రాములు శనగపిండి, మిగిలిన దిగుమతులు 70 గ్రాములుంటాయి. లడ్డూ తయారీని ఎవరూ కాపీ చేయకుండా 2009లో పేపెంట్ రైట్స్ పొందారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కాపీ చేయడానికి వీల్లేదు. కానీ చాలా మంది ప్రయత్నం చేశారు. ఎవరి వల్ల కాలేదు. వెంకటేశ్వర స్వామి (Venkateswara Swamy) మహత్యం ఉందని కాబట్టి ఎవరూ కాపీ కొట్టలేకపోయారు.’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.


Similar News