‘నువ్వే నా సర్వస్వం..’ భార్య భువనేశ్వరికి చంద్రబాబు స్పెషల్ బర్త్ డే విషెస్

ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

Update: 2024-06-20 04:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సీబీఎన్ ట్విట్టర్ వేదికగా మెమొరెబుల్ ట్వీట్ చేశారు. ‘ఎప్పుడూ మద్ధతుగా, ధైర్యంగా, చీకటి రోజుల్లో సైతం చిరునవ్వుతో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంలో 100 శాతం తోడ్పాటునందించే భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు.. నువ్వే నా సర్వస్వం..’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. దీనికి భువనేశ్వరి ట్విట్టర్ వేదికగానే రిప్లై ఇచ్చారు. థాంక్యూ అండి.. మీరే నాకు స్ఫూర్తి.. ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ కోసం అంకితభావంతో పనిచేసే మీకు ఎప్పటికి మద్దుతుగానే ఉంటాను... అని చంద్రబాబు ట్వీట్‌కు బదులిచ్చారు.


Similar News