Breaking News : ప్రపంచ బ్యాంకు నిధుల వినియోగంపై ఏపీ సర్కార్ ఉత్తర్వులు
ఏపీ కూటమి ప్రభుత్వం(AP Govt) కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ కూటమి ప్రభుత్వం(AP Govt) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి(Amaravathi) నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు(World Bank), ఏడీబీ(ADB) కలిసి ఇస్తానని ప్రకటించిన రూ.15 వేల కోట్ల నిధుల విషయంలో ప్రభుత్వం సీఆర్డీఏ(CRDA)కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిధులను ఎలా వినియోగించాలో ఉత్తర్వుల్లో పేర్కొంది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, పలు నిర్మాణాలు, ఉపాధి కార్యక్రమాలు ఈ నిధులతో చేపట్టనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రధాన రోడ్లు, డక్ట్ లు, డ్రెయిన్లు వంటివి చేపట్టాలని సీఆర్డీఏకు సూచించింది. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని తెలిపింది. కాగా సీఆర్డీఏ పంపిన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖ ఇదివరకే ఆమోదించిందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.