CM Chandrababu: వ్యాపార టైటాన్ నే కాదు.. గొప్ప మానవతావాదిని కోల్పోయాం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రతన్ టాటా మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన మరణం దేశానికే తీరని లోటన్నారు.

Update: 2024-10-10 03:17 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశ పారిశ్రామిక రంగంలో చెరగని ముద్ర వేసిన రతన్ టాటా (Ratan TATA Demise) ఇకలేరన్న వార్త తెలిసి దిగ్భ్రాంతి చెందినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలిపారు. రతన్ టాటా మృతి పట్ల ఆయన ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు. తమ దార్శనికత, చిత్తశుద్ధితో ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరని పేర్కొన్నారు. కేవలం ఒక వ్యాపార టైటాన్ నే కాదు.. అసలు సిసలైన గొప్ప మానవతావాదిని కోల్పోయామన్నారు. పరిశ్రమ, దాతృత్వం, తర్వాతి తరాలకు స్ఫూర్తినిచ్చే ఆయన వ్యక్తిత్వం, దేశ నిర్మాణానికి ఆయన చేసిన విశేషమైన సేవల్ని గుర్తుచేసుకున్నట్లు చెప్పారు. అలాంటి వ్యక్తి లేకపోవడం.. పారిశ్రామిక రంగానికే కాదు.. దేశానికే తీరని లోటన్నారు.

రతన్ టాటా మృతితో తీవ్ర దుఃఖంలో ఉన్న టాటా గ్రూప్ కు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టాటా సంస్థ కోసం కృషి చేసిన తన స్నేహితుడు.. ఇప్పుడు శాంతితో విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.  


Similar News