ఏపీ కేబినెట్ సమావేశం.. చెత్తపన్నుపై నిర్ణయం!

మరికాసేపట్లో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో అమరావతి, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం.

Update: 2024-10-10 04:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: మరికాసేపట్లో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో అమరావతి, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే మూడు సిలిండర్ల పంపిణీ, పీ-4 కార్యక్రమం అమలుపై మంత్రి వర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించిన చెత్త పన్ను రద్దుపై కూడా ఈ సమావేశంలో చర్చించి మంత్రి వర్గం ఆమోదం తెలపుతుందని సమాచారం.

ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు ముందుగా ముంబై వెళ్లి రతన్ టాటాకు నివాళి అర్పించాలని, ఆ తర్వాత సాయంత్రానికి తిరిగి వచ్చి కేబినెట్ సమావేశం నిర్వహించుకోవాలని అనుకున్నారు. కానీ ముంబై విమానాశ్రయాల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఫ్లైట్ డిలే అవుతున్నట్లు అధికారుల నుంచి చంద్రబాబుకు సమాచారం అందించింది. దీంతో ముందుగా కేబినెట్ సమావేశం నిర్వహించి ఆ తర్వాత ముంబై వెళ్లాలని నిర్ణయించుకున్నారు.


Similar News