తుఫానుగా మారుతున్న వాయుగుండం.. భారీ వర్షాల హెచ్చరికలు జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రతరం చెంది.. శ్రీలంక మీదుగా భారత్ వైపు దూసుకొస్తుంది.

Update: 2024-11-26 13:58 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రతరం చెంది.. శ్రీలంక మీదుగా భారత్ వైపు దూసుకొస్తుంది. కాగా తీవ్రంగా మారిన ఈ వాయుగుండం రేపటికి తుఫాను(Cyclone)గా బలపడుతుందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(AP Disaster Management Agency) చెప్పుకొచ్చింది. కాగా ఈ తుఫాను కారణంగా రాగల నాలుగు రోజుల్లో.. కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తారు నుంచి భారీ వర్షాలు( heavy rains) కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా ఈ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురవనున్నాయి.

అలాగే రెండు రోజుల తర్వాత కాకినాడ, కోనసీమ, కృష్ణా, నెల్లూరు, సత్యసాయి అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోర్టులలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఈ వాయుగుండం ప్రస్తుతం రాష్ట్రానికి 1200 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఇప్పటికే తీర ప్రాంతాల్లో సముద్రంలో అలలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.


Similar News