మద్యం దుకాణాల లైసెన్స్‌లతో ఏపీ ప్రభుత్వానికి భారీగా ఆదాయం
ఏపీ ప్రభుత్వానికి నూతన మద్యం దుకాణాల లైసెన్స్ కోసం వచ్చిన దరఖాస్తులతో భారీగా ఆదాయం సమకూరింది.
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వానికి నూతన మద్యం దుకాణాల లైసెన్స్ కోసం వచ్చిన దరఖాస్తులతో భారీగా ఆదాయం సమకూరింది. బుధవారం రాత్రి వరకు వచ్చిన 57,709 దరఖాస్తులకు సంబంధించి రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ప్రభుత్వానికి రూ.1154.18 కోట్ల ఆదాయం లభించింది. నేడు, రేపు కూడా దరఖాస్తులకు అవకాశం ఉండడంతో మరో 40 వేల దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో దరఖాస్తుల ద్వారా మరింత ఆదాయం రాష్ట్ర ఖజనాకు చేరనుంది. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 2 దుకాణాలకు అత్యధికంగా 217 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 4,420, ఏలూరులో 3,843, విజయనగరంలో 3,701 దరఖాస్తులు వచ్చాయి.
ఈ నెల 14వ తేదీన అధికారులు మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది. రెండేళ్ల పాటు లైసెన్స్ లు చెల్లుబాటు అవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలకు టెండర్ల ఆహ్వానిస్తున్నారు.