AP News:సీఎం చంద్రబాబు పై మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో టీడీపీ కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది

Update: 2025-01-02 12:07 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో టీడీపీ కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు(గురువారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఖుషి సినిమాలో ‘ఆడువారి మాటలకూ అర్ధాలే వేరులే’ అన్నట్లు సీఎం చంద్రబాబు మాటలకు అర్ధాలే వేరులే అంటూ ఎద్దేవా చేశారు. 2019లో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన కూడా నా అంత నిజాయితీపరుడు ప్రపంచంలోనే లేడు అని చెబుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు.

6 నెలల్లో రూ.లక్షా 20 వేల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. అభివృద్ధిని పట్టించుకోకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు? అని ప్రశ్నించారు. సెకీ కేసులో ఏం లేదని తెలిసే చంద్రబాబు ఊరుకున్నారు. ఐపీఎస్‌ల(IPS) మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి సీఎం చంద్రబాబు(CM Chandrababu) అని విమర్శలు గుప్పించారు. గోడౌన్‌లో బియ్యం పోతే డబ్బులు కట్టించుకోవచ్చు. క్రిమినల్ కేసులు పెట్టడం ఏంటి? అని ప్రశ్నించారు. పేర్ని నాని భార్యను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించడం కక్ష సాధింపు కాదా? అని మాజీ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు.

Tags:    

Similar News