మైన్స్ మాజీ డైరెక్టర్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ

మైనింగ్ శాఖలో కూడా భారీగా అక్రమాలు జరిగాయని గుర్తించిన ప్రభుత్వం.. ఈ ఇష్యూను ఏసీబీకి అప్పగించింది.

Update: 2024-09-12 14:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి.. అధికారంలోకి వచ్చింది. అనంతరం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం అక్రమాలు జరిగాయని తేలిన శాఖలపై యాక్షన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మైనింగ్ శాఖలో కూడా భారీగా అక్రమాలు జరిగాయని గుర్తించిన ప్రభుత్వం.. ఈ ఇష్యూను ఏసీబీకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. సెప్టెంబర్ 12 గురువారం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మైన్స్ డైరెక్టర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కాగా ఆయనపై గతంలో నిబంధనలకు విరుద్ధంగా మైన్స్‌ను కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు.. మైనింగ్ పనుల్లో రూ.2,566 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.


Similar News